Pawan Kalyan: నా కలల సారథి చంద్రబాబు 9 d ago
ఏపీ: తానేదో అయిపోవాలని కలలు కనలేదని, ప్రజలు ఏదో కావాలని కలు కన్నానని, తన కలలను, ప్రజల ఆకాంక్షలను నడిపించగల సారథిగా, దార్శనికుడిగా చంద్రబాబు తప్ప తనకు ఎవరూ కనిపించలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే 2014 రాష్ట్ర విభజన సమయంలో ఒక్క చట్టసభల సీటు ఆశించకుండా మద్దతిచ్చినట్లు తెలిపారు. విజన్ 2047 డాక్యుమెంట్‌ను విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.
పోడియం వద్దకు వస్తున్న పవన్ కల్యాణ్ యాంకర్ ముక్కుసూటి మనిషి అని సంబోధించారు. పవన్ మాట్లాడుతూ.. తన ముక్కసూటి తనం వల్ల మంచి జరిగితే పర్వాలేదన్నారు. రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. విజన్ 2047లో భాగస్వామ్యం అయినందుకు సంతోషకరమన్నారు. తన టీనేజీలో జీవితం పట్ల కలలు, ఆశలు ఉండేవన్నారు. ఒక బుక్‌లో భవిష్యత్తు ఇరవై ఏళ్లు ఎలా ఉండాలనే మిషన్ స్టేట్‌మెంట్ చదివినప్పుడు హాస్యాస్పదంగా అనిపించిందన్నారు. 1990లో తాను హైదరాబాద్‌కు షిప్ట్ అయినప్పుడు.. రోడ్ల మీద వెళ్తున్న సమయంలో 2020 విజన్ స్టేట్మెంట్ కనిపించిందన్నారు. అప్పట్లో తాను ఆ డాక్యుమెంట్ చదివానని కానీ, తన స్థాయికి అది అర్థం కాలేదని పేర్కొన్నారు. తన ప్రపంచంలో తాను ఉన్నానని, అప్పటికి బయటి ప్రపంచం ఇంకా తెలియదన్నారు పవన్ కల్యాణ్.
చంద్రబాబు తన కోసం కలలు కనలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్న మహా నాయుకుడని కొనియాడారు. 2047కి కలలు కనడం ఒక హాస్యాస్పదంగా ఉండొచ్చని, కానీ, కాలానికి ముందుకెళ్లి చూస్తే.. ఈ మిషన్ స్టేట్‌మెంట్ విలువ అర్థమవుతుందన్నారు. దానికి ఉదాహరణగా చెబుతూ.. 2020 విజన్ స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు మాదాపూర్‌లో తాను తన స్నేహితులతో రాళ్లు రప్పలు చూడటానికి వెళ్లే వాళ్లమన్న విషయాన్ని గుర్తుచేశారు. కానీ, అప్పటి సీఎంగా చంద్రబాబు సైబర్ సిటీ అనే మహా నగరాన్ని చూశారని కొనియాడారు.
ఒక సరికొత్త నగరాన్ని నిర్మించిన వ్యక్తికి డబ్బులు, గుర్తింపు రాదన్న పవన్ కల్యాణ్.. తాజ్ మహల్ రూపకర్త, రాళ్తెత్తిన కూలీలు గుర్తుండరని, కానీ, తాజ్ మహల్ నిర్మాణం మాత్రం ప్రజల్లో గుర్తుండి పోతుందన్నారు. ఈ రోజున ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన సైబరాబాద్, అక్కడ వచ్చిన బిల్డింగ్స్, ఉపాధి అవకాశాల రూపకర్త, శిల్పి, చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
కలిసుంటే.. ఏం సాధించగలమో గత ఎన్నికల్లో నిరూపితమైందన్నారు. ఈ రోజున 164 అసెంబ్లీ సీట్లు, 21 పార్లమెంట్ సీట్లు సాధించామన్నారు. ఐక్యతగా ఉంటే ఏం సాధించగలం, ఎలాంటి బలముంటుందో అనేది విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు తనకర్థమైంది., చాలా తృప్తిగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడి దశాబ్దాల అనుభవం, పారిపాలన సామర్థ్యాలు చాలా అమోఘమన్నారు.
తాను పార్టీ పెట్టి మరింత నలిగిన తర్వాత చంద్రబాబు విలువ తెలిసిందన్నారు పవన్ కల్యాణ్. దీంతో ఆయన మీద మరింత గౌరవం పెరిగింన్నారు. ఇక్కడ ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్యాసదృశ్యమని పేర్కొన్నారు. అనేక మందిని ఒక తాటిపై, భావంపై నడిపించడం, తద్వారా ప్రజలకు మేలు చేయడం.. వాళ్లను అభివృద్ధి వైపు తీసుకెళ్లడం చాలా కష్టతరమైందన్నారు.